సిద్ధరామయ్యపై కేసు పెట్టండి.. పోలీసులకు కోర్టు ఆదేశం

  • డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి ఆక్రమణ
  • ఇల్లు కట్టుకున్నాక వేరొకరికి విక్రయం
  • ఆరోపించిన పిటిషనర్
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా మైసూరు రెండో సెషన్స్ కోర్టు ఆదేశించింది. సీఎంతోపాటు మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేయాల్సిందిగా మైసూరులోని లక్ష్మీపురం పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకునే సమయంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ మైసూరుకు చెందిన నాగరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రభుత్వం కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. తర్వాత ఆ ఇంటిని సిద్ధరామయ్య విక్రయించారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Karnataka
Sidharamaiah
mysore
court

More Telugu News